అక్కినేని అఖిల్ గూఢచారి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్-2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటించనున్నారు. సోమవారం అఖిల్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. గూఢచారిగా అఖిల్ పాత్ర కొత్తదనంతో కూడుకొని ఉంటుందని, ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన అనుభూతినందిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. సాక్షివైద్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్హాప్ తమిజా సంగీతాన్నందిస్తున్నారు.