Akhil Akkineni | అక్కినేని ఇంట మరో పెళ్లి బాజా మోగనుంది. ఇప్పటికే నాగార్జున పెద్ద కొడుకు నటుడు నాగ చైతన్య శోభితా ధుళిపాళను డిసెంబర్లో వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. తాజాగా నాగార్జున రెండో కొడుకు అఖిల్ కూడా వివాహాబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించాడు నాగార్జున.
ఈ విషయాన్ని నాగార్జున ఎక్స్ వేదికగా తెలుపుతూ.. అఖిల్‌కు ఈరోజు జైనబ్‌తో నిశ్చితార్థం అయ్యింది. జైనబ్‌ను మా ఫ్యామిలీలోకి ఆహ్వానించడం కంటే సంతోషమైన విషయం ఇంకొకటి లేదు. ఈ సంతోషమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఈ జంటపై ఉండాలి దీవించండి.
We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8, to our daughter in law to be Zainab Ravdjee!
We couldn’t be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and… pic.twitter.com/5KM7BU00bz
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2024