విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్ (Liger). బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిటాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ భామ ఈ చిత్రంతో అనన్యపాండే (Ananya Pandey) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. కాగా చిత్రయూనిట్ లైగర్ తొలి సాంగ్ అక్డీ పక్డీ (Akdi Pakdi song) అప్డేట్ అందించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం నేడు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
అక్డీ పక్డీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది లైగర్ టీం. లిజో జార్జ్ అండ్ డీజే చేతాస్ కంపోజ్ చేసిన పార్టీ మూడ్‌లో ఫుల్ మాస్ బీట్తో సాగుతూ మ్యూజిక్ లవర్స్ లో జోష్ నింపుతోంది. తెలుగులో ఈ పాటను భాస్కరబట్ల రాయగా..అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు. లైగర్ చిత్రంలో రమ్యకృష్ణ కీ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ రోల్లో కనిపిస్తున్నాడు. లైగర్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.