గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొత్త మలుపు’. శివవరప్రసాద్ కేశనకుర్తి దర్శకుడు. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్నది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నది. సోమవారం ట్రైలర్ను ఆవిష్కరించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రేమ, వినోదం, సస్పెన్స్ సమపాళ్లలో ఉంటాయని, నాయకానాయికలు బావామరదళ్లుగా కనిపిస్తారని దర్శకుడు తెలిపారు.
తెరపై కోనసీమ అందాలను ఆవిష్కరిస్తూ చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, గాయని సునీత, నిర్మాత సి.కల్యాణ్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి కెమెరా: సుమంత్ కాచర్ల, జవహర్ రెడ్డి, సంగీతం: యశ్వంత్నాగ్, దర్శకత్వం: శివ వరప్రసాద్ కేశనకుర్తి.