సందీప్‌కిషన్‌తో ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మళ్లీ సందీప్‌కిషన్‌తోనే మరో సినిమాను నిర్మించటానికి రెడీ అయ్యింది. ప్రొడక్షన్ నంబర్ 26గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మాయా వన్’ అనే పేరును ఖరారు చేశారు. జనాదరణ పొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్‌జెడ్/మాయ వన్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందనుంది.
సి.వి.కుమార్ దర్శకుడు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. ఇందులో సందీప్‌కిషన్‌కి జోడీగా ఆకాంక్ష రంజన్‌కపూర్ నటిస్తున్నది. దర్శకుడు మాట్లాడుతూ ‘అత్యంతశక్తివంతుడైన ఓ దుర్మార్గుడితో ఓ సామన్యుడు చేసే పోరాటమే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రపంచప్రఖ్యాతి గాంచిన సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా కార్తీక్ కె.తిైల్లె. సంగీతం: సంతోష్ నారాయణ.