Trisha | నాలుగు పదుల వయస్సు దాటినా కుర్రహీరోయిన్లకు గట్టి పోటీనే ఇస్తుంది చెన్నై చంద్రం త్రిష (Trisha). తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూ.. రెండు దశాబ్దాలకుపైగా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం త్రిష ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమాల్లో విజయ్ (Vijay) తో కలిసి నటిస్తున్న లియో (Leo.. Bloody Sweet).. మోహన్‌లాల్ నటిస్తోన్న రామ్.. పార్టు 1 ఉన్నాయి. దీంతోపాటు కమల్ హాసన్ 234 (KH 234)లో కూడా దాదాపు త్రిష హీరోయిన్గా ఫైనల్ అయినట్టు ఇన్సైడ్ టాక్.
కాగా ఇప్పుడు మగిజ్ తిరుమేని డైరెక్షన్లో అజిత్ కుమార్ (Ajithkumar) నటిస్తోన్న VidaaMuyarchi గురించి ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్టులో త్రిష హీరోయిన్గా ఫైనల్ కాగా.. తమన్నా సెకండ్ హీరోయిన్గా నటించనుందని ఇన్సైడ్ టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి.. అని తెలుస్తోంది. మొత్తానికి అజిత్ ఈ సారి ఇద్దరు భామలతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడని తాజా న్యూస్‌తో క్లారిటీ వచ్చేసింది.
ఈ ఏడాది మణిరత్నం భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2తో సూపర్ సక్సెస్ అందుకుంది త్రిష. ఈ భామ ఖాతాలో తమిళంలో ది రోడ్, సథురంగ వెట్టై 2 సినిమాలున్నాయి. తమన్నా ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి జైలర్‌లో నటిస్తోంది. జైలర్ ఆగస్టు 10న విడుదల కానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్‌లో నటిస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది.