Actor Ajith Tatoo | ఒకవైపు సినిమాలు, మరోవైపు కార్ రేసింగ్‌లతో నిత్యం బిజీగా గడుపుతున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. తాజాగా తన కుటుంబంతో కలిసి కేరళలో పర్యటనకు వెళ్లాడు. భార్య షాలినీ, కుమారుడు ఆద్విక్తో కలిసి అజిత్ కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న శ్రీ ఊటుకులంగర భగవతి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకున్నాడు. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించిన అజిత్, తన కొడుకు ఆద్విక్తో కలిసి ఆలయ పూజల్లో పాలుపంచుకున్నారు. అయితే ఈ ఫొటోల్లో అజిత్ ఛాతీపై ఉన్న అమ్మవారి టాటూ (పచ్చబొట్టు) ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ టాటూ అజిత్ యొక్క ఆధ్యాత్మిక చింతనను తెలియజేస్తుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ టాటూ ఊటుకులంగర భగవతి అమ్మన్ దేవి చిత్రమేనని ఈ దేవత అజిత్ కుటుంబానికి కులదైవం అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. అజిత్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Latest pics of Thala AJITH sir with his family at Palakkad ♥️
Pure grace & simplicity 🙏#AjithKumar pic.twitter.com/PzUU3WOjG7
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) October 24, 2025