Ajith Kumar | సూపర్ బైక్‌పై.. హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టిన అజిత్.. VIDEO
Ajith Kumar | బైక్ రైడింగ్ అంటే సౌత్ ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar). తాజాగా అజిత్ తన సూపర్ బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టారు.
Ajith Kumar | బైక్ రైడింగ్ అంటే సౌత్ ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar). ఈయనకు బైక్‌లన్నా, బైక్ రైడింగ్లన్నా విపరీతమైన ఇష్టమన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన అనేక బైక్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఖాళీ సమయం దొరికిందంటే చాలు తన వద్ద ఉన్న సూపర్ బైక్ (superbike)పై చక్కర్లు కొడుతుంటారు ఈ స్టార్ హీరో. బైక్ రైడింగ్‌పై ఉన్న మక్కువతో ఒక్కోసారి వందల కిలోమీటర్లు సైతం బైక్‌పైనే ప్రయాణిస్తుంటారు. తాజాగా అజిత్ తన సూపర్ బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టారు.
అజిత్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా షూటింగ్ కోసం ఇక్కడే ఉంటున్న అజిత్.. విరామ సమయంలో తన వద్ద ఉన్న బైక్‌పై సరదాగా రైడ్‌కు వెళ్తున్నాడు. సోమవారం సాయంత్రం కూడా ఆయన తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక ప్రస్తుతం సిటీలో గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ కొనసాగుతుండగా.. అజిత్ కుమార్ టీంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత త్వరలోనే అజిత్ టీం రష్యాకు వెళ్లనుందని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని చెప్పకనే చెబుతోంది.
ఇప్పటివరకు వచ్చిన కథనాల ప్రకారం ఈ ఇత్రంలో అజిత్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతుండగా.. వీటిలో ఒకటి నెగెటివ్ రోల్ అని టాక్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారని సమాచారం.
అజిత్‌కుమార్ మరోవైపు లీడ్ రోల్లో నటిస్తోన్న Vidaa Muyarachiకు సంబంధించి భారీ క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ కొనసాగుతుందని ఓ వార్త ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్లు బాబీ డియోల్, జాన్ అబ్రహాం పేర్లు వినిపిస్తుండగా.. ఎవరిని ఫైనల్ చేశారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Also Read..
Chiranjeevi | ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి : మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi | మరో అరుదైన గౌరవం.. చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా
Rajasthan | ఎడారి రాష్ట్రంలో భానుడి భగభగలు.. 3,622కి చేరిన వడదెబ్బ బాధితులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

