భయాన్నే భయపెడతాడు
తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటించిన బహుభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటించిన బహుభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 10న పానిండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. విభిన్నమైన అవతారాల్లో నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఈ ట్రైలర్లో అజిత్ కనిపిస్తున్నారు. కొడుకుని కాపాడుకోవడానికి భయంకరమైన తన పాత జీవితంలోకి తిరిగి వచ్చే ఓ తండ్రి పాత్రలో అజిత్ కనిపిస్తున్నారు.
ట్రైలర్లో ఆయన పాత్ర చిత్రణ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. భయాన్నే భయపెడతాడనే డైలాగ్ హీరో క్యారెక్టర్ పవర్‌ని సూచిస్తున్నది. అధిక్ రవిచంద్రన్ మెస్మరైజింగ్ ప్రజెంటేషన్, అజిత్ మాస్ అప్పీల్, అద్భుతమైన విజువల్స్, పవర్ఫుల్ డైలాగ్స్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలకపాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, సమర్పణ: గుల్షన్‌కుమార్, భూషణ్‌కుమార్, టి.సిరీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

