Bigg Boss OTT Telugu | బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రారంభం అయింది. ఇప్పటికే వారియర్స్ పేరుతో ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. తొలి కంటెస్టెంట్గా అషురెడ్డి, తర్వాత మహేశ్ విట్ట.. మూడో కంటెస్టెంట్గా ముమైత్ ఖాన్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
తర్వాత తొలి కంటెస్టెంట్గా చాలెంజర్ అజయ్ కతుర్వార్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అజయ్.. నటుడు. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో నటించాడు. డ్యాన్సర్ కూడా. సంకి అంటూ.. బిగ్ బాస్ హౌస్లోకి అజయ్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే తనే ఓ కథ రాసుకొని మూవీని డైరెక్ట్ చేయడంతో పాటు హీరోగా కూడా నటిస్తానని అజయ్ నాగార్జునకు చెప్పుకొచ్చాడు.