తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్లలో ముందు వరుసలో ఉంటాడు అజయ్ (Ajay) . ఖుషీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. విక్రమార్కుడు సినిమాలో అజయ్ పోషించిన టిట్లా పాత్ర గూస్బంప్స్ తెప్పించేలా సాగుతుంది. నెగెటివ్, కామిక్, ఎమోషనల్.. ఇలా ఏ జోనర్‌లోనైనా కనిపించే టాలెంట్ అజయ్ సొంతం. తాజాగా అజయ్ అఘోరాగా కనిపించబోతున్నాడు.
సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న చిత్రం విరూపాక్ష (Virupaksha). ఈ చిత్రం ట్రైలర్లో అఘోరాగా అజయ్ విజువల్స్ స్టన్నింగ్ కనిపిస్తున్నాయి. విరూపాక్షలో అజయ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. నెట్టింట అజయ్ అఘోరా లుక్కు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే విరూపాక్ష సినిమా అజయ్ కెరీర్లో ముఖ్యమైన సినిమాగా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు.
కార్తీక్ దండు దర్శకత్వంలో సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరూపాక్షలో బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు నటిస్తున్నారు. అజయ్ మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
విరూపాక్ష ట్రైలర్..
విరూపాక్ష టీజర్..
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
రిస్కీ బైక్ స్టంట్ గ్లింప్స్ వీడియో..
Mark Antony | మార్క్ ఆంటోనీ సెట్స్‌లో ఎస్జే సూర్య, విశాల్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Agent | యాక్షన్ అవతార్‌లో మమ్ముట్టి.. ఏజెంట్ స్టన్నింగ్ లుక్
Dhruva Natchathiram | విక్రమ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ధ్రువ నక్షత్రం ఫస్ట్ లుక్