టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ దేవాకట్టా (Dev Katta) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్ (Republic). ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ కు మంచి స్పందన వచ్చింది. కాగా తాజాగా ఐశ్వర్యరాజేశ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) ఈ లుక్ ను లాంఛ్ చేసింది. ఐశ్వర్యరాజేశ్ ఈ చిత్రంలో మిరా హన్సన్ పాత్రలో నటిస్తోంది. ఐశ్వర్య స్కెచ్ లుక్ తో విడుదలైన పోస్టర్ లో..కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం..అంటూ రాసిన నినాదాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
ఐశ్వర్యరాజేశ్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టుగా తాజా లుక్ లో కనిపిస్తోంది. ఈ సీజన్ టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో రిపబ్లిక్ ఒకటి. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్బోబర్ 1 విడుదల చేయనున్నారు. రిపబ్లిక్ లో రమ్యకృష్ణ, జగపతిబాబు కీ రోల్స్ లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ ఇందులో పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నట్టు సమాచారం.
జేబీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ తో అసోసియేట్ అవుతూ..జే భగవాన్, జే పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ప్రజాస్వామ్య వ్యవస్థలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ లను ఉటంకిస్తూ ఈ సినిమా సాగనుంది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ