తెరపై తన ప్రవర్తనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రతిభ గల నటి ఐశ్వర్య రాజేష్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఆమెతో పాటు మీనాక్షి చౌదరి నటించింది. ఆమె అద్భుతమైన అందగత్తె అయినా.. స్క్రీన్ ప్రెజన్స్ విషయంలో ఐశ్వర్య ఆమెకు ఏ మాత్రం తగ్గలేదన్నది నిజం. కెమెరా ముందు ఆమె యాటిట్యూడ్ అలా ఉంటుంది. రీసెంట్గా తానా మహాసభల్లో తను పాత్రల్ని సెలక్ట్ చేసుకునే విధానం గురించి మాట్లాడింది ఐశ్వర్య రాజేష్. ‘నలుగురు పిల్లలకు తల్లిగా నటించేంత పెద్ద వయసు నాది కాదు. కానీ అలాంటి పాత్ర లభిస్తే మాత్రం వెనకడుగు వేయను.
నటి అన్న తర్వాత పాత్రలో ఒదిగిపోవడం ముఖ్యం. అది ఎలాంటి పాత్రయినా సరే. దానికి వయసుతో నిమిత్తం లేదు. నేను చాలా సినిమాల్లో తల్లిగా నటించాను. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కూడా నేను బిడ్డల తల్లినే. ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే.. నీకు ఆరుగురు పిల్లలుంటారని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. అయినా సరే.. నేనేం వెనుకాడను. అరుగురు పిల్లల తల్లిగా నటిస్తా.’ అంటూ చెప్పుకొచ్చారు ఐశ్వర్య రాజేష్.