Farhana | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh). ఈ భామ అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ బ్యూటీ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘ఫర్హానా’ (Farhana). మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఓ వైపు వివాదాలు చుట్టుముట్టినా.. మరోవైపు బాక్సాఫీస్ వద్ద విమర్శకులు ప్రశంసలు అందుకుంది.
కాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకుంది. ఫర్హానా జులై 7న ప్రీమియర్ కానుంది. ప్రేమ, ఆశ ప్రపంచంలోకి జులై 7న అడుగుపెట్టండి అంటూ సోనీ లివ్ స్పెషల్ వీడియోను ట్వీట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సోనీ లివ్ ఫర్హానా తమిళ వెర్షన్‌తోపాటు తెలుగు వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం.
నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. జీతన్ రమేశ్, సెల్వ రాఘవన్, ఐశ్వర్య దత్త, కిట్టీ, అనుమోల్ కీలక పాత్రల్లో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. ఐశ్వర్య రాజేష్ తమిళంలో విక్రమ్‌తో కలిసి ధ్రువ నక్షత్రంలో నటిస్తోంది. దీంతోపాటు మూడు మలయాళ సినిమాలు, మరో తమిళ సినిమాలు ఐశ్వర్య రాజేశ్ ఖాతాలో ఉన్నాయి.
Step into a world of love, hope, and triumph with ‘Farhana’! #Farhana streaming from 7th July only on Sony LIV@aishu_dil @selvaraghavan @JithanRamesh @aishwaryadutta6 @anumolofficial @justin_tunes @gokulbenoy @EditorSabu @nelsonvenkat @sakthi_raj7 @prabhu_sr pic.twitter.com/kyueLUMkl9
— Sony LIV (@SonyLIV) June 28, 2023