టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి కూతురు అతియాశెట్టి (Athiya Shetty)తో డేటింగ్ లో ఉన్నట్టు ఇప్పటికే చాలా కథనాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందరికీ ఈ విషయంపై క్లారిటీ ఉన్నా..కేఎల్ రాహుల్ కానీ, అతియా కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వీరిద్దరికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బీటౌన్‌లో రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారన్న (wedding) వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
తెరపైకి వచ్చిన అప్ డేట్ ప్రకారం ఇప్పటికే వెడ్డింగ్ ప్లాన్స్ పై చర్చలు నడుస్తున్నాయని, ఈ ఇద్దరి వెడ్డింగ్ ఈవెంట్ డిసెంబర్లో జరుగబోతుందని ఓ ముంబై మీడియా కథనం సారాంశం. అయితే వెడ్డింగ్ వార్తలపై క్రికెట్ అండ్ మూవీ లవర్స్ కు క్లారిటీ ఇచ్చాడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి (Ahan Shetty). ఓ ఇంటర్వ్యూలో అహాన్ శెట్టి మాట్లాడుతూ..వెడ్డింగ్ లాంటిదేమి లేదని, పెళ్లిపై వస్తున్న కథనాలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు.
ఐపీఎల్ లక్నో సూపర్ జియాంట్స్ టీమ్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. సక్సెస్‌ఫుల్‌గా టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు కేఎల్ రాహుల్. 2015లో హీరో సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది అతియా శెట్టి. 2019లో నవాజుద్దీన్ సిద్దిఖీతో కలిసి మోతీ ఛూర్ చక్నాఛూర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అతియాశెట్టి..మరే ప్రాజెక్టును ప్రకటించలేదు.