Agent Movie Songs | అక్కినేని అఖిల్ ఎన్నో ఎళ్ళుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో హిట్టు సాధించినా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఏజెంట్’ సినిమాపైనే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స ఈ సినిమాలోని ఏందే ఏందే అంటూ సాగే మెలోడియస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తెలంగాణ మాండలికంలోని లిరిక్స్ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. హిప్ హప్ తమిళ తన స్టైల్లో మంచి క్రిస్పీ ట్యూన్‌ను కంపోజ్ చేశాడు. అంతే క్యాచీగా పద్మలత, సంజిత్ హెగ్దేతో కలిసి పాటలను ఆలపించాడు. ఆస్కార్ గ్రహిత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించాడు. ఇప్పటికే రిలీజైన మళ్లీ మళ్లీ సాంగ్ ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య నటిస్తుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.