Chhaava Movie | మరీ.. ఇలా ఉన్నారేంట్రా.. ‘ఛావా’ సినిమా చూసి నిధి తవ్వడానికి వెళ్లిన ఊరి ప్రజలు
Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. రూ.450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా చూసిన ఒక ఊరి ప్రజలు నిధి కోసం తవ్వడానికి ఏకంగా పలుగు, పారలు పట్టుకుని బయలుదేరారు.
ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో, శంభాజీ మహారాజ్‌ను ఓడించిన తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠా రాజుల వద్ద ఉన్న నిధిని దోచుకుని, దాన్ని మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్లో ఉన్న అసిర్గఢ్ కోటలో దాచినట్లు చూపించారు. అయితే అక్కడ నిజంగానే నిధి ఉందని నమ్మిన బుర్హాన్పూర్ ప్రజలు తవ్వకాలు ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ ప్రాంతంలో వందలాది మంది స్థానికులు పారలు, పలుగులు, జల్లెడలతో కోట చుట్టూ రాత్రిపూట తవ్వడం మొదలుపెట్టారు. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ తవ్వకాలు జరిగాయని, దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఘటన సినిమా ప్రభావం వలన ప్రజలు ఎంతగా ప్రేరేపితులవుతారో స్పష్టం చేసింది. అయితే, అధికారులు ఈ తవ్వకాలను గమనించి, ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మాట్లాడుతూ.. ఛావా సినిమా కేవలం కల్పితం మాత్రమే సినిమా మొత్తం నిజం కాదని వెల్లడించాడు.
#Chhava movie showed that Mughals looted Gold and treasure from Marathas and kept it in the Asirgarh Fort, Burhanpur, MP.
After watching the movie, locals flocked to the spot with digging tools, metal detectors and bags to dig up the treasure and take it home.
My heart bleeds… pic.twitter.com/zUiGyMoQKh
— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

