Kajal | ఉపాసన తర్వాత ఆ గౌరవాన్ని అందుకున్న కాజల్ అగర్వాల్
Kajal Aggarwal receives UAE's Golden Visa | టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.
Kajal Aggarwal receives UAE’s Golden Visa | టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖులకు యూఏఈ ప్రభుత్వం అందించే గోల్డెన్ వీసాను అందుకుంది. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తర్వాత కాజల్ ఈ అరుదైన గౌరవం దక్కించుకుంది. గోల్డెన్ వీసా దక్కడంపై కాజల్ అగర్వాల్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కళారంగానికి చెందిన సెలబ్రిటీలకు యూఏఈ ప్రభుత్వం తనవంతు ప్రోత్సాహాన్ని అందిస్తోందని, గోల్డెన్ వీసా దక్కడం సంతోషంగా ఉందని తెలిపింది. యూఏఈ ప్రభుత్వంతో భాగస్వామ్యంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొంది.
యూఏఈ ఇచ్చే గోల్డెన్ వీసా ప్రత్యేకత ఏంటి?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యూఏఈ)లో ఎలాంటి ఆంక్షలు లేకుండా దీర్ఘకాలికంగా నివసించేందుకు గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుంటారు. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేయడం మొదలైంది. ఈ లాంగ్‌టర్మ్ వీసాలకు 5, 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత అవే రెన్యువల్ అవుతాయి. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు.. ఇలా వివిధ రంగాల వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలను అందిస్తుంది. ఈ వీసాతో యూఏఈ పౌరులుగా ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే వంద శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.
Happy to have received UAE’s Golden visa. This country has always been such huge encouragement for artists like us. Grateful and looking forward to future collaborations in the UAE.
Big thank you to Mr Muhammed Shanid of Juma Almheiri, Suresh Punnasseril and Naressh Krishna pic.twitter.com/XDuuO4boPG
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 3, 2022
కాజల్ కంటే ముందు గోల్డెన్ వీసా వచ్చింది వీరికే..
యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ గోల్డెన్ వీసాను భారత్ నుంచి సినీ ప్రముఖుల్లో మొదటగా షారుఖ్‌ఖాన్ అందుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు సంజయ్ దత్, సునీల్ శెట్టి, మౌనీ రాయ్, ఫరా ఖాన్, బోనీ కపూర్ ఫ్యామిలీ , నేహా కక్కర్, సింగర్ సోనూ నిగమ్ ఈ వీసాను పొందారు. ఈ వీసాను అందుకున్న తొలి తమిళ కథానాయికగా త్రిష రికార్డుకెక్కింది. ఆమె తర్వాత అమలాపాల్ ఈ వీసాను పొందింది. మలయాళ ఇండస్ట్రీ విషయానికొస్తే మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో ఈ వీసా అందుకున్న మొదటి వ్యక్తిగా ఉపాసన నిలిచారు. ఇప్పుడు కాజల్ కూడా ఆ గౌరవాన్ని అందుకుంది. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త షోయెబ్ మాలిక్ కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి
ఛాన్స్ అడిగితే ఆ స్టార్ హీరో కోరిక తీర్చమన్నాడు.. నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు
Divi Vadthya | బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో విలన్‌గా టాలీవుడ్ స్టార్ హీరో..?
పుట్టు మచ్చల గురించి అడగటం ఆయన విజ్ఞతకే వదిలేశాను : నేహాశెట్టి
మూడేండ్ల తర్వాత నాగ శౌర్యకు సమాధానం చెప్పిన సాయి పల్లవి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

