Dimple Hayathi | సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కేవలం అందం మాత్రమే ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి. అది లేక చాలా మంది ముద్దుగుమ్మలు అలాగే మిగిలిపోతుంటారు. అందం ఉన్నా.. అందాల ఆరబోతకు ఓకే అన్నా కూడా కొందరు భామలకు అవకాశాలు మాత్రం రావు. అందులో డింపుల్ హయతి కూడా చేరిపోయేలా కనిపిస్తుంది.
గల్ఫ్, యురేకా వంటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి వచ్చిన డింపుల్ హయతికి హరీశ్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన గద్దలకొండ గణేశ్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాలో చేసిన ఒక్క ఐటెం సాంగ్‌తో బాగా పాపులర్ అయిపోయింది డింపుల్ హయతి. జర్రా జర్రా.. అంటూ అదిరిపోయే డాన్సులకు తోడు అందాల ఆరబోతలోనూ పిచ్చెక్కించింది. ఈ సినిమా తర్వాత అమ్మడికి మంచి ఆఫర్లే వచ్చాయి.
మొన్నటికి మొన్న మాస్ రాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన ఖిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇందులో బికినీతో పాటు లిప్‌లాక్ సీన్లలోనూ నటించింది. అయితే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఈ భామకు పెద్దగా కలిసిరాలేదు. మరోవైపు తమిళంలో విశాల్ హీరోగా వచ్చిన సామాన్యుడు కూడా నిరాశపరిచింది. హిందీలో ధనుష్, అక్షయ్ కుమార్ కాంబోలో వచ్చిన అత్రంగి రే బాగానే ఉన్నా ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడంతో ఈమె కెరీర్‌కు హెల్ప్ కాలేదు. అందుకే హాట్ ఫొటోలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అలా అయినా ఏదో ఓ దర్శకుడు సరైన అవకాశం ఇస్తాడేమోనని అనుకుంటున్నది.
Dimple Hayathi | చూపులతో గాలం వేస్తున్న ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయతి..”
“Dimple Hayathi | వైట్ కలర్ శారీలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డింపుల్ హయతి..”
Dimple Hayathi | రెడ్ డ్రెస్‌లో డింపుల్ హయతి హోయలు..”
Dimple Hayathi | టైట్ ఫిట్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న డింపుల్ హయతి”