Subrahmanyaa | పాపులర్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్, ప్రొడ్యూసర్ బొమ్మాళి రవిశంకర్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్య (Subrahmanyaa). రవిశంకర్ కుమారుడు అద్వయ్ (Advay) ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి రవిశంకర్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే సుబ్రహ్మణ్య గ్లింప్స్ లాంచ్ అప్డేట్.. మరో 24 గంటల్లో ఫైర్ అంటూ ఇప్పటికే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మరో న్యూస్ షేర్ చేసింది టీం. సుబ్రహ్మణ్య గ్లింప్స్ ఫస్ట్ అడ్వెంచర్ సెప్టెంబర్ 16న ఉదయం 11:11 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సుబ్రహ్మణ్యలో అద్వయ్ స్టైలిష్ వారియర్‌గా కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ చెప్పకనే చెబుతోంది.
ఈ మూవీకి కేజీఎఫ్, సలార్ లాంటి చిత్రాలకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Get ready to be enchanted with a glimpse to the world of #Subrahmanyaa. September 16 | 11:11 AM pic.twitter.com/bWx5LoOQjO
— BA Raju’s Team (@baraju_SuperHit) September 15, 2024
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Hari Hara Veera Mallu | ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్.. పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే.!