Adivi Sesh | టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ (Dacoit) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రేజీ యాక్షన్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో మే 8వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత నెల ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, అడివి శేష్ మార్క్ యాక్షన్ మరియు మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విడిపోయిన ఇద్దరు ప్రేమికులు మళ్ళీ కలుసుకున్నప్పుడు వారి జీవితాల్లో ఎదురైన సవాళ్లు మరియు ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుండటంతో అటు శేష్ అభిమానులు, ఇటు ఓటీటీ ప్రియులు మే 8 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tea is spilled 😳☕️#DacoitOnPrime, May 8
⏯️ in Telugu, Tamil, Kannada, Malayalam@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 #SupriyaYarlagadda @Deonidas #ZaynMarieKhan @bhaskarla_sai @atul_kulkarni #BheemsCeciroleo @abburiravi @AnnapurnaStdios @AsianSuniel #SSCreations… pic.twitter.com/HMCEBBTKPd— prime video IN (@PrimeVideoIN) May 3, 2026