అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హిట్ 2’. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకుడు. ఈ నెల 29న సినిమా విడుదల చేస్తామని ముందు ప్రకటించినా ఇప్పుడా తేదీ మారనుంది.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ…‘హిట్ 2’ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలని అనుకున్నాం కానీ మేజర్ సినిమా ప్రచారం, ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించే క్రమంలో కొంత సమయం తీసుకున్నాం. పరిస్థితిని నిర్మాత నానికి చెప్పాను. ఆయన అర్థం చేసుకున్నారు. త్వరలోనే సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభిస్తాం. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రంలో కృష్ణ దేవ్ అనే పాత్రలో శేష్ కనిపించనున్నారు.