Adipurush Movie Trailer | సరిగ్గా మరో నలభై రోజుల్లో ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. నిన్న, మొన్నటి వరకు సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ, గత రెండు వారాల నుంచి చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, లిరికల్ సాంగ్ ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవలే రిలీజైన అప్డేట్ టీజర్ కూడా కాస్త బెటర్‌గానే అనిపించింది. వీఎఫ్ఎక్స్లో చాలా వరకు మార్పులు చేసినట్లు కనిపించింది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో రూపొందిన ఆదిపురుష్ రిలీజ్ డేట్‌పై నిన్న మొన్నటి వరకు క్లారిటీ లేదు. కచ్చితంగా ఈ సారి వస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించింనా.. ప్రేక్షకుల్లో నమ్మకం లేదు. అయితే తాజాగా న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా జూన్ 13న ప్రదర్శితమవుతుందని చిత్రబృందం తెలిపింది. దాంతో ఈ సినిమా జూన్ 16న కచ్చితంగా వస్తుందన్న క్లారిటీ వచ్చేసింది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా అప్డేట్లు ప్రకటిస్తూ.. గత రెండు, మూడు నెలలుగా ఈ సినిమాపై నెగెటీవిటీ తగ్గిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ను అందించింది. ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభాస్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది.
టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 16న తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందే న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో మూడు రోజుల పాటు ఆదిపురుష్ మూవీ ప్రదిర్శితం కానుంది. కాగా ఇప్పటికే మూడు రోజులకు సంబంధించిన టిక్కెట్లు అమ్ముడుపోయాయని సమాచారం.
@manojmuntashir #ShivChanana @neerajkalyan_24 @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush @AAFilmsIndia pic.twitter.com/fh5fpGqJ0O
— UV Creations (@UV_Creations) May 6, 2023