Adipurush Movie Collections | రివ్యూల సంగతి పక్కన పెడితే ఆదిపురుష్ సినిమాకు మాత్రం కలెక్షన్లు దండిగా వస్తున్నాయి. తొలిరోజే నూట నలభై కోట్ల వరకు దూసుకెళ్లిన సినిమా రెండో రోజు వంద కోట్లు కొల్లగొట్టింది. తొలిరోజే స్థాయిలోనే రెండో రోజు కూడా కలెక్షన్లు రాబట్టడం అంటే ఆశా మాశీ కాదు. అది కూడా డిజాస్టర్ టాక్‌తో. ఇక్కడ కంప్లీట్‌గా ప్రభాస్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ప్రభాస్ పేరు చాలు రికార్డులు బద్దలవడానికి అన్న రీతిలో వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మరో సెన్సేషన్ రికార్డు సాధించింది.
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు దాదాపు ముప్పై కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా నైజాంలోనే దాదాపు పదిహేను కోట్లు మేర కలెక్షన్లు సాధించింది. దీంతో నైజాంలో నాన్-ఆర్ఆర్ఆర్ రికార్డును సాధించి రికార్డు నెలకొల్పింది. ఇక ప్రభాస్‌ను నైజాం కింగ్ అని ఎందుకుంటే ఈ నెంబర్స్ చూస్తే స్పష్టమయింది. ఓవరాల్‌గా ఈ సినిమా రెండు రోజుల్లో రెండోందల కోట్లకు పైగా కలెక్సన్లు సాధించింది. ఆదివారం కూడా బుకింగ్స్ భారీ రేంజ్‌లోనే ఉన్నాయి. అయితే రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌తో ఫస్ట్ వీకెండ్ వరకు ఎంత లేదన్నా కలెక్షన్లు భారీగానే వస్తాయి. మరీ ఇదే జోరు వీక్ డేస్‌లో కొనసాగుతుందో లేదో చూడాలి.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా.. కృతిసనన్ సీత పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురిడు పాత్ర పోషించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. తెలుగులో పీపుల్ మీడియా సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేసింది.