Adipurush Movie Songs | సరిగ్గా ఇంకో పదిహేడు రోజుల్లో ఆదిపురుష్ విడుదల కానుంది. నిన్న, మొన్నటి వరకు అసలు ఏ మాత్రం అంచనాల్లేని ఈ సినిమాపై ఇటీవలే రిలీజైన జై శ్రీరామ్ పాట, ట్రైలర్ తిరుగులేని హైప్ తెచ్చిపెట్టాయి. టీజర్‌తో వచ్చిన నెగెటివిటీ అంతా ఈ రెండింటితో పటా పంచలయింది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్సే కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. దానికి తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెసే ఉదాహరణ. కేవలం తెలుగా రాష్ట్రాల్లోనే జీఎస్టీతో కలుపుకొని రూ.185 కోట్ల బిజినెస్ జరిగిందంటే ఆశా మాశీ కాదు. అది కూడా ఒక మైథలాజికల్ సినిమాకు. దీన్ని బట్టి ప్రభాస్ రేంజ్ ఏంటో ఈజిగా అర్థమయిపోతుంది.
ఇక సినిమాపై రోజు రోజుకు ఆదరణ పెరుగుతూనే ఉంది. దానికి తగ్గట్లే చిత్రబృందం కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని రామ్ సీతా రామ్ పాటను విడుదల చేశారు. సంచెత్ పరంపర స్వరపరిచిన ఈ పాటను కార్తిక్ ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. లెటెస్ట్‌గా రిలీజై ఈ పాట మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. లంకలో ఉన్న సీత కోసం రాముడు పడే వేదనను ఈ పాట రూపంలో తెలియజేశారు. విజువల్స్ బాగున్నాయి. రాముడు, హనుమంతుడితో సీతకు ఉంగరాన్ని పంపించడం.. తిరిగి సీత గాజును రాముడికి పంచించడం పాటలో చూపించారు. ఈ పాటతో సినిమాపై మరింత హైప్ పెరగడం ఖాయం.
రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తన్హాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.