Adipurush Movie Promotions | ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ మరో రెండు వారాల్లో విడుదల కానుంది. నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై ట్రైలర్, పాటలు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. గతేడాది చివర్లో విడుదలైన టీజర్ ఓ రేంజ్లో ట్రోల్స్‌కు గురైంది. దాంతో చిత్రయూనిట్ దెబ్బకు ఆరు నెలలు షూటింగ్‌ను వాయిదా వేసి మెరుగైన వీఎఫ్ఎక్స్ను తీర్చిదిద్దడంలో మునిగిపోయింది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో వచ్చిన నెగిటీవిటీ అంతా ట్రైలర్‌తో పటా పంచలయింది. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.
తాజాగా మేకర్స్ హనుమంతుడికి సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఆగ్రహంతో గధను పట్టుకున్న హనుమంతుడి పోస్టర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను దేవదత్త గజానన్ పోషించాడు. ఇప్పటికే రిలీజై ఆయన పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హనుమంతుడి గెటప్ పర్ ఫెక్ట్ గా సూట్ అయినట్లు అనిపించింది. మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జూన్ 6న పెద్ద ఎత్తులో జరుగనుంది. ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయి.