Adipurush Movie Jai Shri Ram Song | ఆదిపురుష్ విడుదలకు ఇంకా నాలుగు వారాలు కూడా లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తిరుగులేని అంచనాలు క్రియేట్ చేసింది. టీజర్‌తో వచ్చిన నెగిటీవిటీ అంతా ట్రైలర్‌తో పటా పంచలయింది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. ఏడు నెలల క్రితం రిలీజైన టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో ఏకంగా ఆరునెలలు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. వీఎఫ్ఎక్స్ను మెరుగు పరచడం కోసం మరో వంద కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఇక ట్రైలర్ చూస్తే ఆ డబ్బుకు న్యాయం జరిగిందనే అనిపించింది.
ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. దానికి తోడు మేకర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా చిత్రబృందం ఈ సినిమాలోని జైశ్రీరామ్ ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్లో కొన్ని సీన్లు, మరికొన్ని కొత్త షాట్స్ ఈ పాటలో యాడ్ చేశారు. ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొరుచుకుంటున్నాయి. ఈ పాటతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా అనిపిస్తుంది. అజయ్-అతుల్ స్వర పరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు.
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక జూన్ 13న ఈ సినిమాను ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితం చేయనున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు జూన్ 15కు పోస్ట్ పోన్ చేశారు. కాగా ఈ ప్రదర్శన కోసం పెట్టిన టిక్కెట్లు అన్నీ క్షణాల్లోనే బుక్ అయ్యాయట. దీన్ని బట్టి చూస్తే ఆదిపురుష్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది.