లీలమ్మో.. శ్రీలీలమ్మో..
పంజా వైష్ణవ్‌తేజ్, శ్రీలీల జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పంజా వైష్ణవ్‌తేజ్, శ్రీలీల జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాశ్‌కుమార్ స్వరాలందించిన ఈ చిత్రానికి చెందిన మూడవ పాటను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘లీలమ్మో..’ అంటూ సాగే ఈ పాటను పంజా వైష్ణవ్‌తేజ్, శ్రీలీలపై చిత్రీకరించామని, ఈ సినిమా ప్రథమార్థమంతా వైష్ణవ్, శ్రీలీల, సుదర్శన్ కాంబినేషన్లో సరదాగా సాగిపోతుందని, సెకండాఫ్ మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు చెప్పారు. తన పేరుతో మొదలయ్యే ‘లీలమ్మో..’ పాటంటే తనకెంతో ఇష్టమని, అందరూ ఎంజాయ్ చేసేలా ఈ పాట ఉంటుందని శ్రీలీల చెప్పింది. షూటింగ్ సరదాగా సాగిపోతుందని, అలాగే సినిమా కూడా సరదాసరదాగా ఉంటుందని పంజా వైష్ణవ్‌తేజ్ అన్నారు. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తం సినిమా విడుదల కానుంది. జోజు జార్జ్, అపర్ణాదాస్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, ప్రసాద్ మూరెళ్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

