నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న లారెన్స్ నటుడిగా విభిన్న కథాచిత్రాలతో మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘అధిగారం’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ వెట్రిమారన్ కథ, మాటలు అందించడం జరిగింది. వెట్రిమారన్ సినిమా అంటే వయోలెన్స్, రివేంజ్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు .
తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఈ సినిమా పక్కా రివెంజ్ డ్రామాగా ఉంటుందని అర్దమవుతుంది. లారెన్స్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో మలేషియాలో షూటింగ్ మొదలుకానుంది. 50 రోజుల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నారు. అనంతరం ఇండియాలోని పలు లోకేషన్లలో చిత్రీకరణ జరుపుతారట. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్ది రోజులలో వెల్లడించనున్నారు.