Kalki 2898 AD | ప్రభాస్ కల్కి 2898 ఏడీపై సూపర్ బజ్.. మరిన్ని థియేటర్లు యాడ్
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD).జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. అంతా అనుకున్నట్టుగానే సూపర్ పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది.
Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేశాడు. జూన్ 27 (గురువారం) ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. అంతా అనుకున్నట్టుగానే సూపర్ పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది.
ఫస్ట్ డే అద్బుతమైన టాక్‌తో హౌస్‌ఫుల్ షోలతో స్క్రీనింగ్ అయిందని తెలిసిందే. బిగ్ బీ, దీపికాపదుకొనే, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్లు సినిమాలో భాగం కావడంతో బజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. సినిమాకు వస్తున్న స్పందనను చూసి డిస్ట్రిబ్యూటర్లు నార్తిండియాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని స్క్రీన్స్‌ను యాడ్ చేశారు. ఈ రెస్సాన్స్ ఇలాగే కొనసాగితే ఇతర రాష్ట్రాల్లో మరిన్ని థియేటర్లు కూడా చేరిపోవచ్చిన ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రానున్న రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని మూవీ లవర్స్ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
GHMC | లంచాలు ఇచ్చినోళ్లకే పనులు.. ఇంజినీరింగ్ విభాగంలో అవినీతి ‘అక్రమార్కులు’
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

