Raabta music video | ది కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ముంబై భామ ఆదా శర్మ (Adah Sharma) . ఆదా శర్మ వన్ మ్యాన్ షోలా సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆదాశర్మ తాజాగా మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. జుబిన్ నౌటియాల్ (Jubin Nautiyal)తో కలిసి Raabta మ్యూజిక్ వీడియో చేసింది ఆదా శర్మ.
ఈ మ్యూజిక్ వీడియోను అందరితో షేర్ చేసుకున్నారు టీం మెంబర్స్. జునైద్ వసి రాసిన ఈ పాటను చిరంతన్ భట్ కంపోజిషన్‌లో జుబిన్ నౌటియాల్ పాడాడు. ఈ సాంగ్ ఆదాశర్మ, జుబిన్ నౌటియాల్ మధ్య సాగే లవ్ ట్రాక్‌తో సూపర్ కూల్ సౌండ్ ట్రాక్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఈ మ్యూజిక్ వీడియోను ధ్రువల్ పటేట్, జిగర్ ములానీ డైరెక్ట్ చేశారు. ది కేరళ స్టోరీ తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏం ప్రకటించలేదు ఆదా శర్మ.
Raabta మ్యూజిక్ వీడియో..
Creating beautiful memories with #RaabtaSongOutNow as the soundtrack.https://t.co/KqgI5RIpyn
@TSeries @JubinNautiyal @adah_sharma @DhruwalPatel @jigar_mulani @ChirantannBhatt @jndws @the2studios pic.twitter.com/pa17C1rAs0— Shalini (@Shaliniseth_604) September 7, 2023