Actress Sreeleela | మొన్నటి వరకు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ అంటే పూజానో, రష్మికనో అని అని చెప్పేవారు. కానీ ప్రస్తుతం శ్రీలీల పేరే వినబడుతుంది. నటనతో పాటు డ్యాన్స్ లు కూడా అదరగొట్టడంతో యూత్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. తెలుగువారు సైతం శ్రీలీల జపమే చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అవి కూడా అశా మాశీ ప్రాజెక్ట్ లు కావు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్లకు జోడీగా నటిస్తుంది. అంతేకాకుండా శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమ బిజీగా గడుపుతుంది. ఏ రోజు ఏ సినిమా సెట్ లో సందడి చేస్తుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తమిళ నిర్మాతలకు నో చెప్తుందని గుసగుసలు వినిపిస్తుంది.
పెళ్లి సందD సినిమా అంతో ఇంతో హిట్ అవ్వడానికి ముఖ్య కారణం శ్రీలీలే అనడంలో సందేహమే లేదు. ఇక గతేడాది చివర్లో వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ అవడంలో ముఖ్య పాత్ర పోషించింది కూడా శ్రీలీలనే. ఇది సినీ విశ్లేషకులు సైతం అన్న మాటలే. నిజానికి రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం ఎవరితరం కాదని చాలా మంది ఇండస్ట్రీలో అంటుంటారు. అలాంటింది కొన్ని సీన్లలో రవితేజనే డామినేట్ చేసింది అంటే మాములు విషయం కాదు. కాగా ఈ సినిమా తర్వాత శ్రీలీలకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కాల్షీట్లు అడ్జస్ట్ చేయడం వీలుకాకపోవడంతో తమిళ సినిమాలకు నో చెబుతుందట.
ప్రస్తుతం ఈ బ్యూటీ ‘SSMB28’తో పాటు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్-బోయపాటి శ్రీను, నితిన్, వైష్ణవ్ తేజ్ సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటుగా కన్నడలోనూ రెండు సినిమాలు చేస్తుంది.