Sreeleela | ఇటీవల విడుదలైన బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమా తొలి పాటలో బాబాయ్, కూతుళ్లుగా బాలకృష్ణ, శ్రీలీలా చేసిన హంగామా మామూలుగా లేదు. అభిమానులు కూడా ఆ పాటలో బాలకృష్ణ లుక్‌కీ, శ్రీలీల జోష్కీ ఫిదా అయిపోతున్నారు. ఇటీవల ఓ సందర్భంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలను, బాలకృష్ణతో తన అనుభవాలను పంచుకున్నారు శ్రీలీల. సాటి నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి ఫిదా అయిపోయానని శ్రీలీల అన్నారు.
“బాలకృష్ణ సార్ బయట వేరు, కెమెరాముందుకొస్తే వేరు. ఒక్కసారి పాత్రలోకి ఎంటరయ్యారంటే ఇక ఆయన భగవంత్ కేసరే.. బాలకృష్ణ కాదు. అంతగా పాత్రలో లీనమవుతారు. ఇందులో మా పాత్రల గురించి రివీల్ చేయడం నాకిష్టంలేదు. అయితే.. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఆయన నాకు సొంత బాబాయ్లాగే అనిపించారు. ఆయనకూడా లొకేషన్లో నన్ను అలాగే చూసుకున్నారు. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్య సార్‌తో చేయాలనుంది.” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు శ్రీలీల.