Shriya Saran | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది టాలీవుడ్ సినీ నటి శ్రియ శరణ్ (Shriya Saran). బుధవారం ఉదయం తన కుమార్తెతో కలిసి వేకువజామున జరిగే అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు శ్రియ కుటుంబానికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రియ మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని, కుమార్తెకు శ్రీవారి ఆశీస్సులు లభించాయని, తమ కొత్త సినిమా కోసం దీవనలు కోరుకున్నానని శ్రియ మీడియాతో తెలిపారు. ప్రతి ఏటా శ్రీవారిని దర్శించుకునే ఆనవాయితీలో భాగంగానే ఈసారి సుప్రభాత సేవలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని శ్రియ పేర్కొన్నారు.