Actress Shobhita Dhulipala | శోభితాధూళిపాళ్ల.. పేరుగు తెలుగమ్మాయే అయినా..’రమన్ రాఘవ్ 2.0′ అనే హిందీ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అడివిశేష్ నటించిన ‘గూఢాచారి’ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది.ఆ తర్వాత మళ్లీ ‘మేజర్’ సినిమాలో కనిపించింది. అయితే ఈమె పేరు ప్రేక్షకులకు ఎక్కువగా రిజిస్టర్ అయింది మాత్రం నాగచైతన్యతో రిలేషన్లో ఉందన్న వార్తలతోనే. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో కనిపించడంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. అయితే ఈ వార్తలను నాగచైతన్య ఇదివరకే ఖండించాడు. అయినా కానీ డేటింగ్ వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
కాగా ఇప్పటివరకు ఈ వార్తలపై నోరువిప్పని శోభితా తాజాగా డేటింగ్ వార్తలపై స్పందించింది. ‘ఆ రూమర్‌తో నాకు అసలు సంబంధమే లేదు. నేను ఏ తప్పు చేయనప్పుడు అర్జెంటుగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చేయాలని ఎందుకనిపిస్తుంది? తప్పు చేయనప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను అని’ స్పష్టం చేశారు. ఇక ఇటీవలే రిలీజైన ‘పొన్నియన్ సెల్వన్’లో శోభితా ‘వనతి’ పాత్రలో నటించింది. ప్రస్తుతం శోభిత రెండు సినిమాలు చేస్తుంది.