Rekha boj | సామీ సామీ సాంగ్ కోసం రెండు గాజులు అమ్ముకున్న నటి..

Rekha boj saami saami cover song | సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే కొందరికి అవకాశాలు వస్తుంటాయి.. మరికొందరికి మాత్రం ఎన్నో ఏండ్లు నిరీక్షించిన సరైన ఛాన్స్ దొరకదు. అయినా సరే ఎలాగైనా ఇండస్ట్రీ దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిలో గుర్తింపు కోసం పాకులాడుతున్న సినీ నటి రేఖా భోజ్ కూడా ఒకరని చెప్పారు. సినిమాల్లో వేషాలు రాకపోయినా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ.. స్వతహాగా తన టాలెంట్‌ను నిరూపించుకుంటుంది. ఇందుకోసం సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో సామీ సామీ పాటకు స్టెప్పులేస్తూ ఒక కవర్ సాంగ్ తీసింది. ఇప్పుడు ఈ సాంగ్ వైరల్‌గా మారింది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. రష్మిక మందన కథానాయిక. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా పాటలు ఇప్పుడు యూత్‌ను ఉర్రతలూగిస్తుంది. ముఖ్యంగా మౌనిక యాదవ్ పాడిన సామీ సామీ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. దీన్ని తన సెల్ఫ్ ప్రమోషన్ కోసం వాడుకోవాలని అనుకుంది రేఖా బోజ్. ఇందుకోసం సామీ సామీ పాట మీద ఒక కవర్ సాంగ్ చేసింది. ఇందులో వింతేముంది.. ఇవాళ రేపు చాలామంది కవర్ సాంగ్స్ చేస్తున్నారు కదా.. అని అనుకుంటున్నారు కదా ! అక్కడే అసలు విషయం ఉందండీ.. ఒరిజినల్ సాంగ్‌కు ధీటుగా ఉండాలని ఈ సాంగ్ కోసం రేఖా బోజ్ ఎంతగానో కష్టపడింది. సరిగ్గా సినిమాల్లో వాడిన తరహా లొకేషన్లనే సెలెక్ట్ చేసుకుంది. ఇక సాంగ్‌లో రష్మికను అచ్చంగా దించేసింది. కట్టు బొట్టు మొత్తం రష్మికలా తయారైంది. అయితే ఈ సాంగ్ చేయడం కోసం ఆమె చాలానే ఇబ్బందులు ఎదుర్కొందంట. సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు వర్షం పడినా లెక్కచేయకుండా కష్టపడిందంట. అంతేకాదు సామీ సామీ కవర్ సాంగ్ షూట్ చేసేందుకు తన రెండు బంగారు గాజులను కూడా అమ్ముకోవాల్సి వచ్చిందట. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన రేఖా భోజ్.. తన సాంగ్ నచ్చితే సోషల్ మీడియాలో షేర్ చేసి సపోర్ట్ చేయమని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో, రేఖా భోజ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రేఖా భోజ్ హీరోయిన్గా దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమహః వంటి చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ ఇప్పుడు సామీ సామీ కవర్ సాంగ్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుష్ప సినిమాలో సామి సామి పాట అవకాశం ఎలా వచ్చిందంటే..? : సింగర్ మౌనికయాదవ్..
Pushpa: పుష్ప మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారా.. డిసెంబర్ 17న రావడం కష్టమేనా?
సామీ సామీ పాటను మౌనిక యాదవ్ ఫస్ట్ టైం పాడగానే డీఎస్పీ ఎలా ఫీలయ్యాడు?
Samantha: హాట్ టాపిక్‌గా సమంత రెమ్యునరేషన్.. అందరు షాక్
పుష్ప సినిమాలో సామి సామి పాట అవకాశం ఎలా వచ్చిందంటే..? : సింగర్ మౌనికయాదవ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

