Nithya Menen | పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నిత్యమీనన్
Nithya Menen clarifies About Marriage | ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిత్యమీనన్. మొదటి సినిమాతోనే తెలుగులో భారీ విజయం సాధించింది. ఆ తరువాత ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్ళీ ఇదిరాని రోజు’ వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఇటీవలే ‘భీమ్లానాయక్’లో పవన్ భార్యగా అద్భుతమైన నటనను కనబరిచింది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈమె పెళ్ళిపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మలయాళ నటుడితో నిత్య ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే అతడిని పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా వీటిపై నిత్యమీనన్ స్పందించింది.
తన వివాహం గురించి వచ్చిన వార్తల్లో నిజంలేదని, ఏ విషయమైనా నిజం అని తెలిసాకే మీడియాలో పబ్లిష్ చేయాలని చెప్పింది. అంతేకాకుండా పెళ్ళి చేసుకునే ఉద్ధేశమే ఉంటే తనే స్వయంగా చెబుతానని తెలిపింది. ఈ విధంగా తన పెళ్ళిపై వస్తున్న వార్తలను నిత్యమీనన్ ఖండించింది. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిత్య నటించిన ‘తిరుచిత్రంబలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, ప్రియా భవాని శంకర్లు ప్రధాన పాత్రల్లో నటించారు. దీనితో పాటుగా విజయ్ సేతుపతితో ’19(1)a’, షైన్ టామ్ చాకోతో ‘ఆరామ్ తిరుకల్పన’ సినిమాల్లో నటించింది. ఈ రెండు కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

