సమ గౌరవాన్ని కాంక్షించడం తప్పా?
బాలీవుడ్ సినీ పరిశ్రమలో అసమానతల గురించి ఇటీవల కథానాయిక కృతి సనన్ మాట్లాడారు. ఈ క్రమంలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆమె చెబుతూ.. ‘సినిమా బడ్జెట్ పెరుగుదల విషయంలో నిర్మాతలు బాధపడటంలో అర్థం వుంది.
బాలీవుడ్ సినీ పరిశ్రమలో అసమానతల గురించి ఇటీవల కథానాయిక కృతి సనన్ మాట్లాడారు. ఈ క్రమంలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆమె చెబుతూ.. ‘సినిమా బడ్జెట్ పెరుగుదల విషయంలో నిర్మాతలు బాధపడటంలో అర్థం వుంది. కానీ దాన్ని నియంత్రించే క్రమంలో హీరోయిన్ల పారితోషికాలు తగ్గిస్తారు తప్ప, హీరోల పారితోషికాల జోలికి వెళ్లరు.
నిజానికి బడ్జెట్లో ఎక్కువ భాగం హీరో పారితోషికమే ఉంటుంది. కానీ బడ్జెట్ కంట్రోల్ని మా దగ్గర్నుంచే ప్రారంభిస్తారు. అంతేకాదు.. సెట్లోకి హీరో రాకముందే హీరోయిన్ రెడీగా ఉందా? లేదా? అని చూస్తారు. హీరోలను మాత్రం వెయిట్ చేయించరు.
ఈ ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా కెరీర్ తొలినాళ్లలో నాతో నటించిన హీరోకు నా కంటే మంచి కారు ఇచ్చారు. నిజానికి అతను అప్పటికే నాకంటే జూనియర్. నేను కారు గురించి మాట్లాడటంలేదు. గౌరవం గురించి ప్రశ్నిస్తున్నా. హీరోలతో సమానమైన గౌరవాన్ని హీరోయిన్లు కాంక్షించడంలో తప్పులేదని నా ఉద్ధ్దేశ్యం’ అన్నారు కృతి సనన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

