చెన్నై: నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ట్విటర్ అకౌంట్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. గతేడాది ఏప్రిల్‌లోనూ ఆమె అకౌంట్‌ను ఇలాగే ఎవరో హ్యాక్ చేశారు. ఈసారి హ్యాకర్ ఆమె అకౌంట్ పేరును బ్రియాన్‌గా మార్చాడు. కవర్ ఫొటో కూడా మారిపోయింది. ఆమె చేసిన అన్ని ట్వీట్లూ డిలీట్ అయిపోయాయి. గతంలో ఇలా జరిగినప్పుడు ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పింది. 48 గంటల నుంచీ తాను పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని, సాయం చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది.