Actress Jayapradha | సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై కోర్టు షాకిచ్చింది. తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్ను నడిపించింది. కాగా ఈ సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ESI మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక భీమా కార్పోరేషన్ కోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ.. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా వేసింది.
ఎనభై, తొంభై దశకాల్లో జయప్రద ఓ సంచలనం. తెలుగు , హిందీ భాషల్లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు నేలపై పుట్టి హిందీ నాట తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషీ కుమార్ వంటి అగ్ర హీరోలే అప్పట్లో ఆమె డేట్స్ కోసం వేయిట్ చేసే వారంటే ఆమె స్థాయేంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగులోనూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి పలువురు దిగ్గజాలతో కలిసి నటించి విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించింది.