Anicka Vijayi Vikraman | తెర ముందు ముఖానికి రంగేసుకుని అందరినీ అలరించే నటీనటుల జీవితాల్లో రంగు తీసేస్తే ఎన్నో విషాదభరిత కథలుంటాయి. అందరిలో అనలేము కానీ, కొందరి జీవితాల్లో మాత్రం సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విషాదం దాగుంటుంది. ఎన్నో అవమానాలు, మరెన్నో కష్టాలు దాటుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న నటీనటుల జీవితాల్లోకి కొందరు వ్యక్తులు తోడుగా ఉంటామని వచ్చి లేని పోని కష్టాలను తెచ్చిపెడుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే అనుభవిస్తుంది తమిళ నటి అనికా విజయ్ విక్రమన్.
కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లోనూ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనికా. కాగా తాజాగా అనికా తన ప్రియుడు చేసిన ఆఘాయిత్నాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అనికా కొన్ని రోజులుగా అనూప్ పిళ్లై అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. వీరిద్ధరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. కానీ ఈ లోపే బాయ్‌ఫ్రెండ్ అసలు రంగు బయటపడింది. ప్రేమించిన పాపానికి అనూప్ పిళ్లై ఆమెకు నరకం చూపించాడు. రాత్రి పగలు అని తేడా లేకుండా చావబాదాడు. మొహం కూడా గుర్తుపట్టలేని విధంగా అనికాను కొట్టాడు. ఇదే విషయాన్ని అనికా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అనూప్ పిళ్లై తనను మానసికంగా.. శారీరకంగా హింసించాడని అనికా చెప్పింది. ఇలాంటి వ్యక్తిని తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదని, తన భాద, కన్నీళ్లు చూసిన అనూప్‌లో ఎలాంటి మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రోజు రోజుకు అతని హింస మీతిమీరుతుందని, అతనితో ఉంటే ఇలాంటి జీవితం వస్తుందని కలలో కూడా ఊహించలేదని తెలిపింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, ఇలా జరగటం మొదటిసారి కాదని, రెండో సారి అని రాసుకొచ్చింది. దీని గురించి ఇప్పటికే పోలీస్ కంప్లయింట్ ఇచ్చానని వెల్లడించింది. మొదట్లోనే ఈ విషయంపై పోలీస్ కంప్లయింట్ ఇద్దామని అనుకున్నాని, అయితే అనూప్ కంప్లయింట్ ఇవ్వద్దని తన కాళ్లపై పడి వేడుకున్నట్లు అనికా చెప్పింది. ప్రేమించిన పాపానికి అప్పుడు వదిలేసానని, అయినా తను మారలేదని, తన పట్ల మళ్లీ కర్కశంగా ప్రవర్తించాడని చెప్పింది. అయితే ఈ సారి తనను క్షమించాలనుకోలేదని, తనపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చానని పేర్కొంది. అయితే అనూప్ దగ్గర ఉన్న డబ్బులతో పోలీసులను కూడా మ్యానేజ్ చేశాడని అనికా ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలు చూస్తే ఓళ్లు గగుర్పొచేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఒక మనిషి పట్ల ఇంత కర్కశంగా ఎలా ప్రవర్తించాడు అంటూ నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తెరపై ఎంతో అందంగా కనిపించే అనికా ఇలా మోహం కూడా గుర్తుపట్టలేని స్థితిలో మారిపోవటాన్ని చూసి అభిమానులు చలించి పోతున్నారు. అనూప్‌ను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.