నటి అభినయ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ శుభవార్తను తన ఇన్స్టా ద్వారా ప్రపంచానికి తెలియజేశారామె. తనకు కాబోయే భర్తతో కలిసి గుడి గంటను మ్రోగిస్తూ.. చేతులు మాత్రమే కనిపిస్తున్న తమ ఎంగేజ్మెంట్ పిక్ని ఇన్స్టాలో షేర్ చేశారు అభినయ. ‘ఆశీర్వదించండి.. ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు కానుంది.’ అంటూ కామెంట్ని కూడా జత చేశారు. అయితే.. తాను పెళ్లాడబోయేది ఎవర్ని? అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. నటిగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు అభినయ. స్పూర్తిదాయకమైన జీవితం ఆమెది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివశంభో చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రీసెంట్గా విడుదలైన మలయాళ చిత్రం ‘పని’ నటిగా ఆమెను మరోస్థాయిలో నిలబెట్టింది. అలాంటి మంచి నటి.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నానని పోస్ట్ పెట్టడంతో, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.