Golmaal First Look Poster | తమిళ హీరో జీవా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ ప్రొడ్యూసర్ ఆర్.బి చౌదరి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన, అభినయంతో కోలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జీవా ‘రౌద్రం’, ‘స్నేహితుడు’, ‘మాస్క్’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ’83’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘గోల్మాల్’. ప్రముఖ కమెడీయన్ మిర్చి శివ మరో ప్రధాన హీరోగా నటించాడు. ‘చారులత’ ఫేం పోన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
మల్టీస్టారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో హీరోయిన్లతో పాటు జిరాఫీ, ఎలుగుబంటి, పులి, సింహాం లాంటి అడవి జంతువులు ఉన్నాయి. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జాగ్వర్ స్టూడీయోస్ పతాకంపై వినోద్ జైన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌పుత్ పాయల్, తాన్య హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Here's the First Look of Multistarrer #GOLMAAL @iamvinodjain @ijaguarstudios@iamnareshjain @ponkumaranpons@JiivaOfficial @actorshiva @starlingpayal @TanyaHope_offl @iyogibabu @sarofilm @ArulDevofficial @onlynikil pic.twitter.com/SyntMoVgdS
— BA Raju's Team (@baraju_SuperHit) June 6, 2022