Thalapathy 69 | గతేడాది గోట్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమాతో హిట్ అందుకున్న తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దళపతి 69 (Thalapathy 69) అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో పూజ హెగ్దే కథానాయికగా నటిస్తుండగా.. ప్రేమలు బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో నటించబోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ తెలుగులో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ భగవంత్ కేసరి (Bhagavanth Kesari)ని రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై దర్శకుడు కూడా క్లారిటీ ఇస్తూ.. ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ కాదని.. ఇది ఒక ఒరిజినల్ కథ అని.. విజయ్‌కి ఈ చిత్రం పక్కా మాస్ కమర్షియల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందని తెలిపాడు.
ఇదిలావుంటే తాజాగా భగవంత్ కేసరి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తమిళ కామెడియన్, నటుడు వీటీవీ గణేష్. ఆయన మాట్లాడుతూ.. తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ భగవంత్ కేసరి సినిమాను 5 సార్లు చూసి తనకు బాగా నచ్చిందన్నారు. తన చివరి చిత్రంగా ఇది రీమేక్ చేయమని అనిల్ రావిపూడికి పిలిపించుకోగా.. అయితే ఈ ఆఫర్‌ని అనిల్ తిరస్కరించాడు. అందుకే ఈ సినిమా పట్టాలెక్కలేదు అంటూ గణేష్ చెప్పుకోచ్చాడు.
దళపతి 69 సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
“Thalapathy Vijay Saw BhagavanthKesari 5 Times And Wanted It To Be His Thalapathy69 ✨
I Acted In BK And Watched Again To See Whats There In That Film That He Saw It 5 Times 💥” – VTV Ganesh Trolls Both Vijay And The Movie ✨pic.twitter.com/gzCQpB3DeP
— Analyst (@BoAnalyst) January 12, 2025