Actor Vishal | గత కొన్ని రోజులుగా డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్న తమిళ నటుడు విశాల్ ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు తెలుస్తుంది. రీసెంట్గా మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విశాల్ రాగా.. అతడి మొహం వాచి ఉండడం.. చేతులు వణకడం చూసి విశాల్ అభిమానులు కంగారుపడడంతో పాటు ఆందోళన చెందారు. విశాల్ త్వరగా కోలుకొని ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రార్థించారు. అయితే విశాల్ కోలుకున్నట్లు తెలుస్తుంది. నేడు మదగజరాజ సినిమా విడుదల ఉండగా.. ఈ సినిమా ప్రీమియర్‌కి వచ్చిన విశాల్ హుషారుగా కనిపించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా బలంతో నేను ఎలాంటి అడ్డంకులను అయినా అధిగమిస్తాను. ఫీవర్ నుంచి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. నాకు ఇప్పుడు ఎలాంటి వణకు పుట్టించే సమస్యలు లేవు. మీరు నాపై చూపించిన ప్రేమను ఎప్పటికి మర్చిపోలేను. అంటూ విశాల్ మదగజరాజ సినిమా ప్రీమియర్‌లో చెప్పుకోచ్చాడు.
అసలు ఏం జరిగిందంటే.. ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సీ దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన చిత్రం ‘మదగజరాజ’. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను 12 ఏండ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ ప్రమోషన్స్ నిర్వహించగా.. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు విశాల్ బయటకు వచ్చాడు. డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్న విశాల్ ఈ వేడుకకు రావడంతో విశాల్‌ని చూసి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. అతడి మోహం వాచి ఉండడం.. మాట్లాడుతుంటే ఇబ్బంది పడ్డ తీరు.. వణకడం చూసి ఏమైందని అందోళన చెందారు. ప్రస్తుతం అతడు కోలుకోవడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఊపిరి తీసుకుంటున్నారు.
#MadhaGajaRaja – #Vishal‘s emotional speech🥺♥️
“I will overcome any obstacles with my strength✌️. Now I’m perfectly alright, i don’t have any trembling issues now🤝. I will never forget the love you have have shown me till the death. Love you all🫶” pic.twitter.com/D0ewPpIi3j
— AmuthaBharathi (@CinemaWithAB) January 11, 2025