Mogudu Title Promo | తమిళ నటుడు విశాల్ మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఆయన కెరీర్లో 36వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ను వెల్లడించింది చిత్రబృందం. ఈ సినిమాకు హిట్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించబోతుండగా.. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ చిత్రమిది. ఈ సినిమాకు తెలుగులో “మొగుడు” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఖరారు చేస్తూ ప్రోమోను విడుదల విడుదల చేసింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మగ మహారాజు’, ‘మదగజరాజా’, ‘యాక్షన్’ సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రూపొందుతోంది.
ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్గా నటిస్తుండగా, యోగిబాబు ఒక కీలక పాత్రలో అలరించబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ఫుల్ ఫన్నీగా మరియు మాస్ యాక్షన్ ప్యాక్డ్గా ఉంది. ముఖ్యంగా ‘మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం’ అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. ఇందులో తమన్నా భర్తను శాసించే భార్యగా కనిపిస్తుంటే, విశాల్ ఇంట్లో పనులు చేసే అమాయకపు భర్తగా నటిస్తూనే.. భార్యకు తెలియకుండా బయట విలన్ల తాట తీసే మాస్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తుండగా, ACS అరుణ్ కుమార్ ఈ భారీ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు.