Chiyaan Vikram | తమిళ నటుడు చియన్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’(Veera Dheera Sooran) పార్ట్ 2. చిత్తా(చిన్నా) సినిమా ఫేం ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించింది.
ఈ చిత్రం గురువారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అవన్నీ పరిష్కారమైన తర్వాత గురువారం సాయంత్రం థియేటర్లలో విడుదలైంది. దీంతో ఈ సినిమా చూడడానికి నటుడు విక్రమ్‌తో పాటు శివకార్తికేయన్ చెన్నైలోని సత్యం థియేటర్‌కి వెళ్లారు.
సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. సత్యం థియేటర్‌కి విక్రమ్ వచ్చాడని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా అతడిని చూడడానికి ఎగబడ్డారు. ఇక స్క్రీనింగ్ అనంతరం విక్రమ్‌ను అభిమానులు అతడిని చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో జనం నుంచి తప్పించుకోవడానికి థియేటర్ బయటకు వచ్చిన ఆయన తన లగ్జరీ కారును ఎక్కకుండా.. ముందుకు వెళ్లి ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. ఇక విక్రమ్ ఆటోలో ఇంటికి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో మలయాళ విలక్షణ నటుడు సూరజ్ వెంజరముడ్తో పాటు ఎస్.జె.సూర్య, దుశరా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందించారు.
Fans mobbed @chiyaan at Sathyam during #VeeraDheeraSooran premiere show last night..
He couldn’t get back to his car.. So he took an auto back home..
Meanwhile, the movie is getting Blockbuster reports everywhere.. pic.twitter.com/tSzKWblwJI
— Ramesh Bala (@rameshlaus) March 28, 2025