Ponnambalam | నా సొంత తమ్ముడే నాపై విష ప్రయోగం చేశాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు
Tamil Actor Ponnambalam | ముప్పైఏళ్ల క్రితం వచ్చిన 'ఘరానా మొగుడు' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు తమిళ నటుడు పొన్నంబలం. ఈ సినిమాలో కనిపించి కాసేపే అయినా.. చిరుతో రింగులో చేసిన ఫైటింగ్ పొన్నంబలంకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
Tamil Actor Ponnambalam | ముప్పైఏళ్ల క్రితం వచ్చిన ‘ఘరానా మొగుడు’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు తమిళ నటుడు పొన్నంబలం. ఈ సినిమాలో కనిపించి కాసేపే అయినా.. చిరుతో రింగులో చేసిన ఫైటింగ్ పొన్నంబలంకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా తెలుగులోనూ ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయ్యాడు. స్టంట్‌మెన్‌గా కెరీర్ ప్రారంభించిన పొన్నంబలం ‘కలియుగం’ అనే తమిళ సినిమాతో నటుడిగా మారాడు. కెరీర్ మొదట్లో ఏడాదికి పది సినిమాల్లో కనిపించిన పొన్నంబలం ఇప్పుడు కాస్త డల్ అయ్యాడు. ఇదిలా ఉంటే పొన్నంబలం తాజాగా ఓ ఇంటర్వూలో తన సొంత తమ్ముడే తనకు విషం పెట్టి చంపాలనుకున్నట్లు సంచలన విషయాలను వెల్లడించాడు.

గతకొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబలం ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వల్లే తన కిడ్నీలు పాడైయ్యాయని గతకొలంగా ఆయనపై వస్తున్న వార్తలపై పొన్నంబలం తాజాగా స్పందించాడు. అవన్ని అవాస్తవమని తన సొంత తమ్ముడి వలే అలా అయిందని విస్తుపోని నిజాలను వెల్లడించాడు. ‘మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తన కిడ్నీలు విఫలమవుతున్నాయని చాలా మంది భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. తన తండ్రికి నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకును తన సొంత తమ్ముడిగా భావించి మేనేజర్‌గా పెట్టుకున్నా. నా వృత్తిపరమైన విషయాలన్ని తనే చూసుకునే వాడు. అయితే ఒకసారి నేను తాగే బీరులో స్లో పాయిజన్ కలిపాడు. అంతేకాకుండా విషం కలిపిన ఆహారాన్ని పెట్టేవాడు. దాంతో కొంతకాలానికి నా కిడ్నీలు పాడైపోయాయి. ఇక అప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే విష ప్రయోగం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. అయితే అతను అలా చేశాడన్న విషయం ఇటీవలే తెలిసిందని’ పొన్నంబలం చెప్పుకొచ్చాడు.

కిడ్నీలు ఫేయిల్ అవడంతో కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారని, దాంతో తన బంధువు ఒకతను కిడ్నీ దానం చేశాడని పొన్నంబలం చెప్పాడు. అయితే ఆ సమయంలో తనను ఆర్థికంగా చిరంజీవి ఆదుకున్నారని తెలిపాడు. చికిత్స కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఎవరిని అడగాలో, ఏం చేయాలో అర్థం కాని సమయంలో చిరంజీవి గారు గుర్తుకు వచ్చాడని పొన్నంబలం తెలిపాడు. ‘చిరంజీవి గారికి ఫోన్ చేసిన తన సమస్య గురించి చెప్పి, సాయం చేయమని అడిగాను. అప్పుడు చిరంజీవి గారు నేనున్నాంటూ భరోసా ఇచ్చాడు. లక్ష, రెండు లక్షలు హెల్ప్ చేస్తారని అనుకున్నాను. కానీ మరో ఐదు నిమిషాల్లో అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. రిపోర్ట్స్ తీసుకెళ్లి అడ్మిట్ అ్వవమని చెప్పాడు. ఆ హాస్పిటల్లో నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు. మొత్తం బిల్లు 40లక్షలు అయింది. చిరంజీవి గారే అంతా చూసుకున్నారని’ చిరు చేసిన సాయాన్ని వెల్లడించాడు.
పేరుకు తమిళ నటుడే అయిన పొన్నంబలంకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అల్లరి ప్రియుడు, మెకానిక్ అల్లుడు, హిట్లర్, నువ్వు వస్తావని, చెన్నకేశవరెడ్డి, గుడుంబాశంకర్, అన్నవరం, కొడుకు వంటి పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. చివరగా పొన్నంబలం బుజ్జిగాడు సినిమాలో కనిపించాడు. ఆ సినిమా తర్వాతో తెలుగులో పొన్నంబలం ఒక్క సినిమా చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

