Nikhil Spy Intro Glimps | యువ హీరో నిఖిల్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు నిఖిల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘స్పై’ ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా స్పై ఇంట్రో గ్లింప్స్‌ను విడుదల చేశారు.
లెటెస్ట్‌గా విడుదలైన ఇంట్రో గ్లింప్స్‌లో నిఖిల్ స్టైలిష్‌గా ఉన్నాడు. చుట్టూ మంచు.. మంచుతో కప్పి ఉన్న గన్స్ బాక్స్. ఆ బాక్స్‌లో నుండి నిఖిల్ గన్ తీసుకుని మాగజీన్ లోడ్ చేసి.. బైక్ పై ఎవర్నో ఫాలో అవుతూ షూట్ చేస్తున్నట్లు గ్లింప్స్‌లో ఉంది. ఇంట్రో గ్లింప్స్‌ను చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తలపిస్తుంది. జులైన్ ఎస్ట్రాడా కెమెరా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకు తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
A Thrilling Action Extravaganza Across Continents🔥🔍
Presenting, The INTRO GLIMPSE of @actor_Nikhil's #SPY
▶️ https://t.co/tcoGUvTI1Yస్పై – स्पै – ஸ்பை – ಸ್ಪೈ – സ്പൈ@Ishmenon @Garrybh88 @tej_uppalapati @SricharanPakala #EDEntertainments #KRajashekarreddy#Nikhil_SPY pic.twitter.com/rs7Syl9eEy
— Ramesh Bala (@rameshlaus) June 6, 2022