Nani HIT 3 Movie | నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. హయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హిట్లు అందుకున్న నాని రీసెంట్గా కోర్ట్ సినిమాతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్‌లో షురూ చేశారు. ఇందులో భాగంగానే సోమవారం మేకర్స్ ట్రైలర్‌తో పాటు ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ వేడుకలో నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్ 3 నచ్చకపోతే నానిని నమ్మకండంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే కోర్ట్ సినిమాలో నాని మాట్లాడిన ఒక మాట చాలా పాపులర్ అయ్యింది. కోర్ట్ సినిమా నచ్చకుంటే నా హిట్ 3 సినిమాను చూడకండంటూ నాని ప్రకటించాడు. అయితే నాని చెప్పినట్లే కోర్ట్ సినిమా హిట్ అయ్యింది. ఇదిలావుంటే తాజాగా హిట్ 3 వేడుకలో నానిని విలేఖరులు అడుగుతూ.. కోర్ట్ సినిమా లాగానే ఇప్పుడు కూడా ఎదైన బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తారా అని అడుగుతారు. దీనిపై మాట్లాడుతూ.. ఇప్పుడు బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వలేను. ఎందుకంటే కోర్ట్ సినిమాకు నేను నిర్మాత.. కానీ ఇది నా చేతుల్లో లేదు.. అయినా కూడా మీకు మాటిస్తున్న హిట్ 3 నచ్చకుంటే నానిని నమ్మకండంటూ అతడు చెప్పుకోచ్చాడు.